


GowDurbar Agarbatti - Sandal

Description
GowDurbar Blue Agarbatti
|| For Holiness and Fragrance ||
దేవుడు కరుణించాలంటే దీపం, నైవేద్యంతో పాటు ధూపం తప్పనిసరి. అందుకే పూజా సమయాల్లో తప్పనిసరిగా 'అగరు బత్తి'ని వెలిగిస్తారు. వీటిని వెలిగించడం వల్ల ఇల్లంతా సువాసనలు అలుముకుని ఒక పవిత్రమైన ఆధ్మాత్మిక భావం నెలకొంటుంది. అయితే ఈ అగరుబత్తులకు సంబంధించి మార్కెట్లో రకరకాల సువాసనలు పుట్టుకొచ్చాయి. వీటి తయారీలో 90 శాతం హానికారక బొగ్గుపొడి వాడుతున్నారు. అలా తయారైన అగరుబత్తుల నుంచి వచ్చే ధూపం వల్ల కేన్సర్, ఎలర్జీ, శ్వాసకోస రోగాలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు సైతం హెచ్చరిస్తున్నారు. ఇంట్లో మిగతా గదులతో పోల్చితే పూజాగదిలో అగరుబత్తుల వినియోగం వల్లే ఎక్కువ ముప్పు ఉంటుందని నిపుణులు చెబుతున్నారంటే ఒకసారి ఆలోచించండి. ఇలాంటి తరుణంలో పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద చేతుల మీదుగా ఓ అద్భుతం ఆవిష్కృతమైంది.
దేశీ ఆవు అందించే పాలు, పెరుగు, నెయ్యి, పంచితం, గోమయముల పవిత్ర మిశ్రమంతో, బొగ్గుపొడికి బదులు సహజసిద్ధమైన చెట్టు బెరడు చూర్ణంతో తయారు చేసిన అగరుబత్తులు మార్కెట్లోకి వచ్చాయి. అవే 'గౌదర్బార్ అగరుబత్తులు'. వీటిని వాడటం వల్ల తెల్లని పొగతో ఇంటి గోడలకు మసి అంటదు. హాని చెయ్యని దీర్ఘకాల దివ్య పరిమళం పూజ, జప, ధ్యానాదులలో ప్రశాంతమైన అనుభూతినిస్తుంది.